Hyderabad, ఫిబ్రవరి 14 -- Rashmika Mandanna Trolling: నేషనల్ క్రష్ రష్మిక మందన్నాపై మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా శుక్రవారం (ఫిబ్రవరి 14) ఆమె నటించిన ఛావా (Chhaava) మూవీ రిలీజైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో రష్మిక తనది హైదరాబాద్ అని చెప్పుకుంటున్న వీడియో వైరల్ కావడంతో కొందరు కన్నడిగులు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

రష్మిక మందన్నా కర్ణాటకకు చెందిన నటి అయినా.. తెలుగు సినిమాలతోనే పాపులర్ అయింది. తెలుగు నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టి నేషనల్ క్రష్ గా మారిపోయింది. అయితే ఇప్పుడామె ఎక్కడికి వెళ్లినా తనది హైదరాబాద్ అని చెప్పుకుంటోంది. తాజాగా ఛావా మూవీ ప్రమోషన్లలో భాగంగా కూడా రష్మిక మాట్లాడుతూ.. తాను హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని అని చెప్పుకుంది.

"నాది హైదరాబాద్. కానీ ఇక్కడికి ఒంటరిగా వచ్చాను. ఇప్పుడు నేను కూడా మీ కుటుంబంలో ఒ...