Hyderabad, ఫిబ్రవరి 1 -- Rashmika Mandanna Chhaava Promotions On Wheelchair: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల పుష్ప 2 ది రూల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన్నా చేసిన న్యూ హిందీ ఫిల్మ్ ఛావా.

అలాగే, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో సికందర్ అనే మరో మూవీ చేస్తోంది. అయితే, ఈ సికందర్ సినిమా షూటింగ్ సమయంలో రష్మిక మందన్నాకు గాయాలు అయ్యాయి. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు రష్మికకు దెబ్బ తగిలింది. దాంతో వీల్ చైర్‌కే పరిమితం అయింది రష్మిక మందన్నా. మరోవైపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఛావా సినిమా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

రిలీజ్‌కు తక్కువ సమయం ఉండటంతో నడవలేని పరిస్థితుల్లో ఉన్న వీల్ చైర్‌లో వచ్చి ఛావా ప్రమోషన్స్ చ...