భారతదేశం, మే 9 -- Rashmika Mandanna: యానిమ‌ల్ మూవీతో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ స‌క్సెస్‌ను అందుకున్నది ర‌ష్మిక మంద‌న్న‌, ర‌ణ‌భీర్‌క‌పూర్ హీరోగా న‌టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద 900 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. యానిమ‌ల్ హిట్‌తో బాలీవుడ్‌లో ర‌ష్మిక‌కు ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి. తాజాగా ఈ కూర్గ్ బ్యూటీ హిందీలో ఓ బంప‌రాఫ‌ర్‌ను అందుకున్న‌ది. స‌ల్మాన్ ఖాన్‌తో రొమాన్స్ చేయ‌బోతున్న‌ది.

స‌ల్మాన్‌ఖాన్ హీరోగా ఏఆర్ మురుగ‌దాస్‌ ద‌ర్శ‌క‌త్వంలో సికంద‌ర్ పేరుతో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా ఫిక్సైంది. సికంద‌ర్‌లో హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్న పేరును మేక‌ర్స్ గురువారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. స‌ల్మాన్ ఖాన్‌, ర‌ష్మిక మంద‌న్న ఆన్‌స్క్రీన్ మ్యాజిక్‌ను 2025 ఈద్‌కు థియేట‌ర్ల్‌లో చూడ‌టం కోసం ప్రేక్ష‌కుల‌తో పాటు తాము ఆస‌క్...