Hyderabad, మార్చి 28 -- Rashmika Mandanna: రష్మిక మందన్నా ప్రస్తుతం మూడు పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన జోరులో ఉంది. ఇక ఈ ఆదివారం (మార్చి 30) సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన సికందర్ మూవీతో రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించింది. ఇందులో తనకు ఇష్టమైన కొరియన్ డ్రామాలు ఏవో ఆమె చెప్పుకొచ్చింది.

కొరియన్ డ్రామాస్ కొన్నాళ్లుగా ఇండియన్ ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీ వినియోగం పెరిగిన తర్వాత.. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్స్ తో వచ్చే కే డ్రామాలు ఆకట్టుకుంటున్నాయి. సాధారణ ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు కూడా వీటికి ఫిదా అవుతున్నారు.

దీనికి తాజా ఉదాహరణ రష్మిక మందన్నా. ఆమె ఈ మధ్య అభిమానులతో మాట్లాడుతూ.. తనకు కొరియన్ డ్రామాలతోపాటు చైనీస్ డ్రామాలంటే కూడా ఇష్టమని చెప్పింది. నెట్ ఫ్లిక్స...