Hyderabad, మార్చి 10 -- Rashmika Mandanna: రష్మిక మందన్నా గురించి కర్ణాటక ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపడంతో ఆయన దిగి వచ్చారు. తన వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటో చెప్పుకొచ్చారు. రష్మికకు గుణపాఠం చెప్పాలంటే ఆమెపై దాడి చేయడమని కాదని, జీవిత పాఠాలు చెప్పాలని తాను అన్నట్లు రవి కుమార్ అన్నారు.

తాను పుట్టిన పెరిగిన కర్ణాటక రాష్ట్రాన్ని రష్మిక మందన్నా పట్టించుకోవడం లేదని మండిపడుతూ ఈ మధ్యే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ.. ఆమెకు గుణపాఠం చెబుతానని అన్నారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. ముఖ్యంగా కొడవ కమ్యూనిటీ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఈ ఎమ్మెల్యే దిగి వచ్చారు. తన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదంటూ ఏఎన్ఐతో మాట్లాడిన ఆయన వివరణ ఇచ్చారు.

"ఆమెకు గుణపాఠం చెప్పాలని నేను అన్నానంటే అది జీవిత పాఠాలు చెప్పాలని తప్ప.. ...