Hyderabad, మార్చి 13 -- Rashmika Mandanna: రష్మిక మందన్నా ఇప్పుడు కొత్త ఇండియన్ బాక్సాఫీస్ క్వీన్. గత మూడేళ్లలో ఆమె నటించిన మూడు సినిమాలే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించినవి కావడం విశేషం. మూడు సినిమాలు కలిపి రూ.3300 కోట్లు వసూలు చేశాయి. దీపికా పదుకోన్, ఆలియా భట్, ప్రియాంచా చోప్రాలాంటి స్టార్ బాలీవుడ్ హీరోయిన్లను ఆమె వెనక్కి నెట్టడం విశేషం.

రష్మిక మందన్నా 2023 చివర్లో యానిమల్ మూవీలో, గతేడాది పుష్ప 2 మూవీలో, ఈ ఏడాది ఛావాలో మూడు భిన్నమైన పాత్రలు పోషించింది. ఈ మూడు సినిమాలూ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. గత 16 నెలల్లో ఆమె నటించిన మూడు సినిమాలు కలిపి ఏకంగా రూ.3300 కోట్లు వసూలు చేశాయి.

కేవలం హిందీ వెర్షన్ వసూళ్లు చూసుకున్నా.. రష్మిక ఈ మధ్యకాలంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్లు స్పష్టమవుతోంది. ఆమె నటించిన యానిమల్ మూవీ హిందీలో ర...