Hyderabad, ఫిబ్రవరి 13 -- Rashmika Mandanna: రష్మిక మందన్నా.. ఇప్పుడో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. యానిమల్, పుష్ప రెండు పార్ట్ లతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పటికే నేషనల్ క్రష్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్న ఆమె.. తాజాగా ఆ ట్యాగ్ పై స్పందించింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ ట్యాగ్స్ వల్ల టికెట్లు అమ్ముడుపోవని అనడం గమనార్హం.

ఛావా మూవీ రిలీజ్ సందర్భంగా పీటీఐతో రష్మిక మాట్లాడింది. "ఇలాంటి ట్యాగ్స్ కెరీర్లో ఏమీ తోడ్పడవు. అవి కేవలం అభిమానుల ప్రేమ నుంచే వస్తాయి. వాళ్లు అలా పిలవాలనుకుంటారు.. పిలుస్తారు..

కానీ ఈ ట్యాగ్స్ కేవలం ట్యాగ్స్ మాత్రమే. మనం చేసే సినిమాలు, ప్రేక్షకుల ప్రేమే వాళ్లు కొనే టికెట్ల రూపంలోకి మారతాయి. అదే నాకు ప్రత్యేకం" అని రష్మిక అభిప్రాయపడింది.

ఇటు తెలుగు, అటు హిందీ సినిమాల్లో రష్మిక బిజీగా ఉంటున్న వ...