Hyderabad, ఏప్రిల్ 6 -- The Girlfriend Rashmika Mandanna Birthday Poster Released: నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతోంది. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక మందన్నా హిందీలో ఛావా మూవీతో మరో హిట్ అందుకుంది.

ఆ తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన జతకట్టి సికిందర్ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించింది రష్మిక మందన్నా. ఇప్పుడు ఈ నేషనల్ క్రష్ చేస్తున్న మరో తెలుగు సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. ఈ సినిమాలో హీరోగా దసరా, టచ్ మీ నాట్ ఓటీటీ వెబ్ సిరీస్ ఫేమ్ దీక్షిత్ శెట్టి చేస్తున్నాడు.

ఇక హీరో, నటుడు, డైరెక్టర్ అయిన రాహుల్ రవీంద్రన్ ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ...