Hyderabad, ఫిబ్రవరి 2 -- Rashmika Mandanna Teach Telugu To Vicky Kaushal: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుష్ప 2 ది రూల్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ఛావా. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ భర్త విక్కీ కౌశల్ హీరోగా నటించాడు. రష్మిక మందన్నా, విక్కీ కౌశల్ జంటగా నటించిన ఛావా సినిమా ప్రమోషన్స్ కోసం శుక్రవారం (జనవరి 31) హైదరాబాద్‌కు వచ్చారు.

ఛావా చిత్రంలోని 'జానే తు' అనే పాట లాంచ్ సమయంలోనే రష్మిక మందన్నా.. విక్కీ కౌశల్‌కు తెలుగు నేర్పించింది. తెలుగు ప్రేక్షకులతో ఎలా మాట్లాడాలో, సినిమా గురించి ఏం చెప్పాలో నిర్దేశించింది. దీనికి సంబంధించి వీడియోను తాజాగా విక్కీ కౌశల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఛావా మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌కు సంబంధించిన ఈ వీడియోలను పోస్ట్ చేసిన విక్కీ కౌశల్ తనకు తెలుగు నేర్పినందుకు రష్మికకు ధన...