Hyderabad, ఏప్రిల్ 5 -- టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తోన్న రష్మిక మందన్నా ఏప్రిల్ 5న తన 29వ పుట్టినరోజును జరుపుకుంటోంది. వెజిటేరియన్ డైట్ ఎక్కువగా ఫాలో అయ్యే ఈ నటి ప్రతి రోజూ ఉదయం కచ్చితంగా ఒక లీటర్ నీటిని తాగేస్తుందట. అంతే కాదు, అందులో ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా కలుపుకుని తాగుతుందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఇది ఆమె జీర్ణక్రియ, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. రష్మిక మందన్నా బర్త్ డే సందర్భంగా ఆమె తీసుకునే రోజువారీ ఆహారం, వ్యాయామం, సింపుల్ బ్యూటీ రొటీన్ గురించి తెలుసుకుందామా..

మంచి ఆరోగ్యం కోసం మీరు అనుసరించే మార్నింగ్ రొటీన్ గురించి అడిగినప్పుడు, "ఆరోగ్యం కోసం ఉదయం నిద్రలేవగానే చాలా నీరు తాగుతాను. పొద్దున్నే దాదాపు ఒక లీటర్ నీళ్లలో నా డైటీషియన్ చెప్పినట్లుగా ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని తాగుతాను. ఓ మై గాడ్, ...