Hyderabad, ఫిబ్రవరి 12 -- గత ఏడాది బ్రిటన్లోని వాట్ ఫోర్డ్ జనరల్ హాస్పిటల్ లో ఒక బాబు జన్మించాడు. అతని పేరు టామీ ప్యారి అతనిలో ఎంతో ప్రమాదకరమైన అరుదైన మైట్రోక్యాండియల్ జన్యువు ఉన్నట్టు గుర్తించారు. దీనివల్ల అతని గుండె రక్తాన్ని సరిగా పంపు చేయలేక పోతుంది. మెదడుకు కూడా రక్తం సరిగా అందక ఇబ్బంది పడుతుంది. శ్వాస సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. మెదడుకు రక్తం చేరని కారణంగా అది అభివృద్ధి చెందడం లేదు. శరీరానికి కావలసిన శక్తి కూడా ఉత్పత్తి కావడం లేదు. ఇది ఒక అరుదైన ప్రమాదకరమైన జన్యు వ్యాధిగా వైద్యులు చెప్పారు. నిజానికి ఇంతవరకు ఈ జన్యు వ్యాధికి ఎలాంటి పేరును పెట్టలేకపోయారు. ప్రపంచంలో 23 మంది పిల్లల్లో ఈ వ్యాధి ఉన్నట్టు గుర్తించారు.

ఈ జన్యు వ్యాధితో బాధపడిన పిల్లలు 22 మంది రెండు నెలల వయసు నిండకముందే మరణించారు. ఇప్పుడు మరొక పిల్లాడు జన్మించాడు. ఈ బాబు ...