Hyderabad, ఫిబ్రవరి 21 -- అలెర్జీలు ఎంతో మందికి సహజంగానే వస్తూ ఉంటాయి. కొంతమందికి కోడిగుడ్డు తింటే అలెర్జీ వస్తుంది. మరికొందరికి పుట్టగొడుగులు తింటే అలెర్జీ. అలాగే కొన్ని రకాల మొక్కలు వంటివి తాకినా కూడా చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఇవన్నీ కూడా అలెర్జీల వల్లే వస్తాయి. అయితే అతి అరుదైన అలెర్జీతో బాధపడుతోంది ఒక బ్రిటిష్ మహిళ. ఆమె వయసు కేవలం పాతికేళ్ళు. పేరు కెండాల్ ప్రైస్.

కెండాల్ కు తీవ్రమైన నీటి అలెర్జీ ఉంది. దీన్నే ఆక్వాజెనిక్ ఉర్టికేరియా అని అంటారు. ఇది ఆమె జీవితాన్ని నరకం చేసేస్తోంది. కనీసం స్నానం చేయలేదు. తనివితీరా నీళ్లు తాగలేదు. ఎప్పుడైనా వర్షం వస్తునప్పుడు రోడ్డుపై చిక్కుకుపోతే ఇక అంతే సంగతులు. ఆమెకు ఆ నీటి చుక్కలు శరీరంపై పడినప్పుడల్లా యాసిడ్ పడినట్టు మంట, దురద వస్తాయి. ఆ చర్మం అంత కాలిపోయినట్టు అవుతుంది.

ఈ నీటి అలెర్జీ వల్ల ఆమె నర...