భారతదేశం, మార్చి 28 -- రాప్తాడు రాజకీయం మళ్లీ వేడెక్కింది. టీడీపీ వర్సెస్ వైసీపీ ఫైట్ ఉద్రిక్తతకు దారితీసింది. వివిధ స్థానాలకు గురువారం జరిగిన మండలాధ్యక్షుల ఉప ఎన్నికలు ఉద్రిక్తతకు కారణమయ్యాయి. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఘర్షణకు దారితీశాయి. రాప్తాడులో అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

1.ఉమ్మడి అనంతపురం జిల్లాలో వివిధ స్థానాలకు గురువారం మండలాధ్యక్షుల ఉప ఎన్నికలు జరిగాయి. రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది.

2.రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదాపడడంతో మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు సుజాత, సాయిలీల, ఆదిలక్ష్మి, భారతి, వెంకటలక్ష్మి, చిన్నకొండయ్యలను బైండోవర్‌ చేయడం కోసం పోలీసులు పెనుకొండ తహసీల్దార్‌ వద్దకు తీసుకొచ్చారు.

3.ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, రాప్తాడు...