భారతదేశం, ఏప్రిల్ 13 -- కొందరు కామంధులు జంతువులను కూడా వదలడం లేదు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో ఘటన బయటకు వచ్చింది. దిల్లీలో ఓ వ్యక్తి కుక్కలపై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా తెలిసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

దేశ రాజధాని దిల్లీలోని షాహదారా జిల్లాలోని కైలాష్ నగర్ ప్రాంతంలో కొన్ని కుక్కలపై అత్యాచారం చేసిన వ్యక్తిని దిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక జంతు స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేయడంతో నిందితుడు నౌషాద్‌ను అరెస్టు చేశారు. నౌషాద్ ఆ స్వచ్ఛంద సంస్థకు సరఫరాదారుగా పనిచేస్తున్నాడు.

'ఒక వ్యక్తి కుక్కపై లైంగిక దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో కూడా కనిపించింది. ఆ వీడియోలో ఆ వ్యక్తిని ప్రజలు కొట్టడం, ఎన్ని కుక్కలపై అత్యాచారం చేశావని ...