Hyderabad, మార్చి 5 -- Kannada Actress Ranya Rao Arrest At Airport: సోమవారం (మార్చి 3) రాత్రి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 14.8 కిలోల బంగారంతో పట్టుబడిన కన్నడ హీరోయిన్ రన్య రావు అరెస్ట్ అయింది. ఆదాయపు పన్ను విభాగం (డీఆర్ఐ) అధికారులు ఆమెను అరెస్ట్ చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదికలో పేర్కొంది.

అరెస్ట్ అనంతరం ఆర్థిక నేరాలకు సంబంధించిన కోర్టులో రన్య రావును హాజరుపరిచారు. దాంతో రన్య రావుకు 14 రోజులపాటు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దాంతో రన్య రావును జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.

అయితే, రన్య రావు 14.8 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేయడంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఒంటరిగా చేసిందా లేదా దుబాయ్, భారతదేశం మధ్య పనిచేస్తున్న ఏదైనా స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో భాగంగా చేస్తుందా అనే విషయాలపై ఆరా తీస్తున...