భారతదేశం, ఫిబ్రవరి 18 -- సమయ్ రైనా "ఇండియాస్ గాట్ లేటెంట్ షో"లో యూట్యూబ్ సెలబ్రిటీ రణ్​వీర్​ అల్లాబాదియా చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి మాటలు ఎవరికి నచ్చుతాయి? అని ప్రశ్నిస్తూ.. యూట్యూబర్​ మనసులో ఏవో చెడు అభిప్రాయాలు ఉన్నాయని, అవే షో ద్వారా బయటపడ్డాయని వ్యాఖ్యానించింది.

'మీ తల్లిదండ్రులు శృంగారం చేయడాన్ని జీవితాంతం చూస్తావా? లేక ఒకసారి వారితో శృంగారంలో పాల్గొని జీవితం మొత్తం మీద చూడకుండా ఉంటావా?' అని ఇండియాస్​ గాట్​ లేటెంట్​ షోలో బీర్​బైసెప్స్​ యూట్యూబర్​ రణ్​వీర్​ అల్లాబాదియా చేసిన కామెంట్స్​ తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై తన మీద దాఖలైన ఎఫ్​ఐఆర్​లను ఒకేచోట చేర్చి వాటిని కొట్టివేయాలని యూట్యూబర్​ రణ్​వీర్​ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్....