తెలంగాణ,రంగారెడ్డి, ఫిబ్రవరి 13 -- రంగారెడ్డి జిల్లా కోర్టులో గురువారం కలకలం రేగింది. కోర్టు హాల్ లోనే న్యాయమూర్తిపై నిందితుడు చెప్పు విసిరాడు. పోలీసులు, న్యాయవాదులు ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అత్తపూర్ సిక్ విలేజ్ కు చెందిన కరణ్ సింగ్ అనే వ్యక్తి ఓ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతనిపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఇందులో విచారణ నిమిత్తం. ఇవాళ రంగారెడ్డి కోర్టులోని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే. నిందితుడు న్యాయమూర్తిపై దాడి చేశాడు.

ప్రాథమిక వివరాల ప్రకారం.. గురువారం నిందితుడిని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. హత్యాచారం కేసులో జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ క్రమంలోనే ముద్దాయి తన వాదనను వినిపించేందుకు న్యాయమ...