భారతదేశం, డిసెంబర్ 5 -- అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఓవైపు అరెస్టుల పర్వం కొనసాగుతుండగా. తాజాగా మరో అవినీతి తిమింగళం చిక్కింది. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ రికార్డు ఏడీ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసింది. గురువారం నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి.

తెలంగాణ ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ మరియు భూ రికార్డుల కార్యాలయములో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న కొంతం శ్రీనివాసులుపై అక్రమ ఆస్తులకేసు నమోదైంది. అతనితో పాటు బంధువులకు సంబంధించిన 6 స్థలాలలో సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్ లోని రాయదుర్గం మై హోమ్ భుజాలో ఒక ఫ్లాట్, మహబూబ్ నగర్ లో 4 ప్లాట్లు, నారాయణపేట జిల్లాలో ఒక రైస్ మిల్లుతో పాటుగా 3 ప్లాట్లు, ఆంధ్రప్రదేశ్ లోని అన...