Hyderabad, మార్చి 12 -- Ranbir vs Aamir: బాలీవుడ్ హీరోలు, టీమిండియా ప్లేయర్స్ కలిసి ఓ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు డ్రీమ్ 11 కోసం వీళ్లు ఒక్కటయ్యారు. ఆమిర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ ప్రత్యర్థులైన వేళ.. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, బుమ్రాలాంటి క్రికెటర్లు ఎవరి సైడ్ ఉండాలో తేల్చుకోలేక సతమతమయ్యారు. ఈ యాడ్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో మొదట కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడుతున్న ఆమిర్ ఖాన్ దగ్గరికి టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వస్తాడు. ఓ ఫొటో కావాలని అడుగుతాడు. మీతో కాదు రణ్‌బీర్ తో అంటూ పక్కనే ఉన్న అతడిని చూపిస్తాడు. మనోడే అంటూ అతని దగ్గరికి తీసుకెళ్తాడు ఆమిర్ ఖాన్. మీ జనరేషన్ లో పెద్ద స్టార్ రణ్‌బీర్ సింగ్ అంటూ పరిచయం చేస్తాడు. సింగ్ కాదు కపూర్ అని పక్కనే ఉన్న రోహిత్ అంటాడు. ఎవరైతే ఏంటి.. ఇద్దరూ మంచి హ్యాండ్...