భారతదేశం, ఏప్రిల్ 23 -- Ranam Review: వైభ‌వ్‌, నందితాశ్వేత‌, తాన్య‌హోప్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ చిత్రం ర‌ణం ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు ష‌రీఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థియేట‌ర్ల‌లో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచిన ఈ మూవీ ఎలా ఉందంటే?

శివ (వైభ‌వ్‌) క్రైమ్ సీన్ రైట‌ర్ క‌మ్ ఫేస్ రీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ఆర్టిస్ట్‌. ముఖాలు గుర్తుప‌ట్ట‌కుండా జ‌రిగిన హ‌త్య‌ల‌కు సంబంధించిన‌ కేసుల‌ను సాల్వ్ చేయ‌డంలో పోలీసుల‌కు సాయ‌ప‌డుతుంటాడు. ఓ యాక్సిడెంట్‌లో అత‌డు ప్రేమించి పెళ్లిచేసుకున్న కావ్య చ‌నిపోతుంది.

ఆ ప్ర‌మాదంలోనే శివ త‌ల‌కు దెబ్బ‌త‌గులుతుంది. ఏదైనా అనూహ్య సంఘ‌ట‌న‌ల ఎదురైతే కొద్ది క్ష‌ణాల పాటు ఫ్రీజింగ్ అయిపోతాడు. ఓ రోజు మాధ‌వ‌రం పోలీస్‌స్టేష‌న్ ముందు ఓ డెడ్‌బాడీకి సంబంధించిన కాళ...