Hyderabad, ఫిబ్రవరి 3 -- Rana Naidu Season 2: రానా నాయుడు.. రెండేళ్ల కిందట వచ్చి సంచలనం రేపిన వెబ్ సిరీస్. తెలుగు హీరోలు, బాబాయ్ అబ్బాయ్ అయిన వెంకటేశ్, రానా తండ్రీ కొడుకులుగా నటించిన సిరీస్ కావడంతో తెలుగు వాళ్లలోనూ విపరీతమైన ఆసక్తి రేపింది. ఇప్పుడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ రానుండగా.. సోమవారం (ఫిబ్రవరి 3) ఓ చిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో ఈ బాబాయ్, అబ్బాయ్ వార్ మరింత ముదిరినట్లు కనిపిస్తోంది.

రానా నాయుడు సీజన్ 2 ఈ ఏడాదే నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ఈ టీజర్ ద్వారా వెల్లడించింది. రెండేళ్ల కిందట అంటే 2023లో వచ్చిన రానా నాయుడు సీజన్ 1కు కొనసాగింపుగా ఈ రెండో సీజన్ రాబోతోంది. ఈ కొత్త సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోయిన ఈ టీజర్లో వెంకీ, రానా మధ్య వార్ ఈసారి ప...