భారతదేశం, ఏప్రిల్ 9 -- Rana Naidu 2: రానానాయుడు సీజ‌న్ 2కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను డీజే టిల్లు హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రివీల్ చేశాడు. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించిన జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు రానా ద‌గ్గుబాటి ముఖ్య అతిథిగా హాజ‌రు కాబోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ వేడుక‌లో మాత్రం రానా ద‌గ్గుబాటి క‌నిపించ‌లేదు.

రానా ద‌గ్గుబాటి మిస్స‌వ్వ‌డంపై ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ క్లారిటీ ఇచ్చాడు. రానా ముంబాయిలో రానా నాయుడు వెబ్‌సిరీస్‌కు డ‌బ్బింగ్ చెబుతూ బిజీగా ఉన్నాడ‌ని సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ అన్నాడు. డ‌బ్బింగ్ పూర్తిచేసి హైద‌రాబాద్ రావాల‌ని అనుకున్నాడ‌ని, కానీ ఫ్లైట్ మిస్స‌వ్వ‌డంతో పాటు మ‌రో పంచాయితీ ఉండ‌టం వ‌ల్ల రాజా జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజ‌రుకాలేక...