Hyderabad, ఫిబ్రవరి 10 -- Rana Daggubati On Siddu Jonnalagadda Its Complicated Release: డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో వంద కోట్ల క్లబ్‌లో చేరింది. సిద్ధు దశ తిరిగింది. అంతకుముందు సిద్ధు జొన్నలగడ్డ చేసిన సినిమాలై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.

అలా 2020 సంవత్సరంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమానే కృష్ణ అండ్ హిజ్ లీలా. కరోనా కారణంగా థియేటర్లలో ఈ మూవీ విడుదల కాలేదు. దాంతో నేరుగా ఆహాలో కృష్ణ అండ్ హిజ్ లీలా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆహా ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీలో విడుదలైన సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడం ఇదే తొలిసారి.

అయితే, కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా ...