Hyderabad, ఫిబ్రవరి 14 -- Rana Daggubati Comments In Its Complicated Press Meet: సిద్ధు జొన్నలగడ్డ నటించిన యూత్‌ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీలా నేరుగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇదే సినిమాను ఇట్స్ కాంప్లికేటెడ్ టైటిల్‌తో ఇవాళ (ఫిబ్రవరి 14) థియేటర్లలో విడుదల చేశారు.

అయితే, ఇట్స్ కాంప్లికేటెడ్ థియేట్రికల్ రిలీజ్‌కు ముందు సిద్ధు జొన్నలగడ్డ, రానా దగ్గుబాటి, డైరెక్టర్ రవికాంత్ పెరెపుతో క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రానా దగ్గుబాటి, సిద్ధు, రవికాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. "సినిమాని థియేటర్స్‌లో ఆడియన్స్ చుడాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఫిబ్రవరి 14 సినిమాకి యాప్ట్ రిలీజ్. థియేటర్స్‌లో ఆడియెన్స్ ఎగ్జయిట్‌మెంట్ చూడాలని ఉంది" అని చెప...