Hyderabad, మార్చి 20 -- Rana Daggubati: టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా దిగి వస్తున్నారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు వివరణ ఇస్తున్నారు. తాజాగా రానా టీమ్ అతనిపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చింది. చట్టానికి లోబడే ఆ ఒప్పందం కుదుర్చుకున్నట్లు గురువారం (మార్చి 20) ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రతిభ ఆధారిత గేమ్స్ ఉన్న సంస్థతోనే రానా దగ్గుబాటి ఒప్పందం కుదుర్చుకున్నట్లు అతని టీమ్ ఆ ప్రకటనలో వెల్లడించింది. ఇది 2017లోనే ముగిసిందని కూడా చెప్పంది. ఇలాంటి గేమ్స్ చట్టపరంగా అనుమతి ఉన్న ప్రాంతాలకే అతని ఎండార్స్‌మెంట్ పరిమితమని కూడా స్పష్టం చేసింది.

"ప్రతిభ ఆధారిత గేమ్స్ సంస్థతో రానా దగ్గుబాటి ఒప్పందం కుదర్చుకున్నాడు. ఇది 2017లోనే ముగిసింది. ఆన్‌లైన్ లో ప్రతిభ ఆధారిత గేమ్స్ కు...