Hyderabad, మార్చి 31 -- ముస్లింలు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో రంజాన్ ఒకటి. ఆధ్యాత్మిక పునరుద్ధరణ, హృదయ శుద్ధితో పాటు అల్లాహ్ కృపను పొందే పవిత్రమైన పండుగగా భావిస్తారు.ఈ నెలలో ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్షలు పాటిస్తూ, దానధర్మాలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. రంజాన్ మాసం ముగిసిన తర్వాత, ఈద్ ఉల్ ఫితర్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

ఈ ఏడాది రంజాన్ మాసం మార్చి 2వ తేదీ ఆదివారం ప్రారంభమైంది. నెలవంక దర్శనం ఆధారంగా భారతదేశంలో మార్చి 31వ తేదీ సోమవారం రోజున ఈద్ ఉల్ ఫితర్(రంజాన్) పండుగను జరుపుకోనున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా మీ కుటుంబ సభ్యులు, ప్రియమైన వారికి ప్రేమతో కూడిన శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే, ఇక్కడ మీకోసం కొన్ని అందమైన, కవితాత్మకమైన రంజాన్ శుభాకాంక్షలు సందేశాలు ఉన్నాయి. ఇవి అల్లాహ్ ఆశీర్వాదాలతో పాటు సంతోషం, శాంతి, దయ న...