భారతదేశం, మార్చి 28 -- చిరంజీవి కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నాడు. అతను సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అద్భుతమైన ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తున్నారు. కఠినమైన వ్యాయామాలు, ఆహార ప్రణాళికలతో 40 వయసులో కూడా పాతికేళ్లలా కనిపిస్తున్నారు. అతను ఏం తింటున్నారో, తన టోన్డ్ బాడీని ఎలా కాపాడుకుంటున్నారో తెలుసుకునేందుకు అతని అభిమానులు ఎంతోమంది ఆసక్తి చూపిస్తారు.

రామ్ చరణ్ చెబుతున్న ప్రకారం ఆయన ఇంట్లో వండిన భోజనాన్ని తినేందుకు మాత్రమే ఆసక్తి చూపిస్తారు. భోజనం విషయంలో చాలా కఠినంగా ఉంటారు. ఏవి పడితే అవి తినరు. సమతుల్య జీవనశైలిని కొనసాగించడానికి అతను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఫిట్‌నెస్ అనేది 80శాతం మనం తీసుకునే డైట్ మీద ఆధారపడి ఉంటుందని రామ్ చరణ్ అంటూ ఉంటారు.

ఆరోగ్యంగా, అందంగా ఫిట్‌గా కనిపించాలం...