భారతదేశం, ఫిబ్రవరి 11 -- రామరాజ్యం ఆర్మీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. మొదటి స్లాట్‌లో 5 వేల మందిని నియమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రామరాజ్యం ఆర్మీకి తెలుగు రాష్ట్రాల నుంచి రూ.1,20,599 విరాళాలు అందాయి. 20 నుంచి 50 సంవత్సరాల లోపు వారికి మాత్రమే రామరాజ్యం ఆర్మీలో అవకాశం ఇస్తున్నారు. ప్రతి నెల రూ.20 వేల జీతంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రిజిస్ట్రేషన్లు చేయించింది రామరాజ్యం ఆర్మీ.

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసులో.. వీరరాఘవ రెడ్డి సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ నెల 7న రంగరాజన్ పై దాడి జరిగింది. 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగరాజన్. కేసు నమోదు చే...