Hyderabad, ఏప్రిల్ 7 -- Ramam Movie Title Motion Poster Released: రాముడు, రామాయణం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో ప్రభాస్ ఆదిపురుష్ నుంచి ఇంకా రిలీజ్ కాని రణ్‌బీర్ కపూర్ రామాయణ్ వరకు ఎన్నో ఉన్నాయి. అయితే, ఇదే రామాయణం కాన్సెప్ట్‌తో తెలుగు నిర్మాత కొత్త చిత్రాన్ని నిర్మించనున్నారు.

శ్రీరామ నవమి (ఏప్రిల్ 6) సందర్భంగా చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడి.. 'రామం' అనే పాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుట్టారు. 'ది రైజ్ ఆఫ్ అకిరా' అనేది ట్యాగ్ లైన్. రామం చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. అయితే అతనెవరే వివరాలు ఇంకా తెలియపరచలేదు.

ధర్మ సంస్థాపనకు యుద్ధం చేసిన రాముడి అడుగు జాడల్లో నడుస్తూ.. ఆయన చూపిన బాట ప్రపంచానికి ఆదర్శం అని చాటి చెప్పే వీరుడుకి సంబంధించి, ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఓ గొప్ప య...