భారతదేశం, ఏప్రిల్ 4 -- Ramagundam: రామగుండంలో అనధికారిక నిర్మాణాలపై మునిసిపల్ అధికారులు కొరడా జుళిపించారు. నోటీసులు ఇచ్చినా స్పందించక పోవడంతో రూ.99. 28 కోట్ల జరిమానా విధించి చెల్లించకపోతే చట్టప్రకారం తగిన చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు.

దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్తు సరఫరాతో తో వెలుగులు విరజిమ్మే రామగుండం ఎన్టీపిసికి భారీ షాక్ తగిలింది. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన టౌన్ షిప్ లో ఎలాంటి అనుమతి లేకుండా ఆరు ప్రాంతాలలో భారీ నిర్మాణాలు చేపట్టారు.

అనుమతి లేని నిర్మాణాలపై గత మార్చి 19న రామగుండం మునిసిపల్ అధికారులు ఎన్టీపిసి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. నోటీస్ లపై ఎలాంటి స్పందన లేకపోవడంతో మార్చి 29న జరిమానా నోటీసులు జారీ చేశారు. నోటీసుల ప్రకారం ఎన్టీపిసి లోని టైప్ బి బిల్డింగ్ కు రూ.39.61కోట్లు, హెచ్ ఓ డి బిల్డిం...