Hyderabad, మార్చి 2 -- పవిత్ర రంజాన్ మాసం మార్చి 2న ప్రారంభమైంది. ఇస్లాం మతం వారు అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ మాసంలో ముస్లింలు అల్లాహ్‌ను అత్యంత భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు. పవిత్ర కార్యక్రమాలు, దాన ధర్యాలను నిర్వహిస్తారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మాసం అంతా కఠిన ఉపవాస నియమాలను పాటిస్తారు. ఉపవాసం ఉన్నవారు ఉదయం పూట సూర్యోదయానికి ముందు సెహరీలో, మళ్లీ సూర్యస్తమయం తర్వాత ఇఫ్తార్ లో మాత్రమే ఏమైనా తింటారు. మిగిలిన సమయంలో అంటే రోజంతా ఏమీ తినకుండా, కనీసం పచ్చి మంచి నీరైనా తాగకుండానే ఉంటారు.

ఈ కఠిన ఉపవాస దీక్షల సమయంలో చాలా మందిని అసిడిటీ సమస్య వేధిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఇఫ్తార్ తర్వాత కొన్ని చిన్న చిన్నచిట్కాలు పాటించడం ద్వారా...