Hyderabad, ఫిబ్రవరి 22 -- రంజాన్ నెల వచ్చేస్తోంది. రంజాన్ పరమ పవిత్రమైన మాసంగా ముస్లిం సోదరులు భావిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్లో రంజాన్ అనేది తొమ్మిదవ నెల. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు దీన్ని అత్యంత ముఖ్యమైన నెలగా పరిగణిస్తారు. ఈ నెలలో ప్రతిరోజూ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. ఆహారం, పానీయం అన్నింటికీ దూరంగా ఉంటారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసం ఎందుకు ఉంటారో తెలుసుకోండి.

రంజాన్ అనేది ముస్లిం సోదరులకు ఆధ్యాత్మిక నెల. ఇది స్వీయ నియంత్రణను కూడా అందిస్తుంది. అల్లా పట్ల భక్తిని చాటి చెబుతుంది. ఈ నెల అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు ఉపవాసాలు, ప్రార్థనలు, దానాలతో బిజీగా ఉంటారు.

రంజాన్ సమయంలో ఉపవాసం ఉండడం అనేది ముస్లిం సోదరులకు తప్పనిసరి. ఆరాధనా, ఉపవాసం అనేవి అల్లాకు భక్తులను చేరువ చేసే మార్గంగా చెప్పుకుంటారు. రంజాన్ సమ...