Hyderabad, ఫిబ్రవరి 27 -- పవిత్ర మాసమైన రంజాన్ ప్రారంభం అవ్వడానికి కొన్ని రోజులే ఉంది. ఈ సంవత్సరం రంజాన్ మాసం మనదేశంలో మార్చి 1న లేదా రెండో తేదీనా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఆ రోజు నుంచి 30 రోజులపాటు కొనసాగుతుంది.

రంజాన్ మాసంలో ప్రతిరోజూ ఉపవాసం ఉంటారు. సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు. ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాక ఖర్జూరాన్ని తిని భోజనం తింటారు. దీన్నే ఇఫ్తార్ విందు అంటారు. అయితే ఉపవాసాన్ని ఖర్జూరాలు తినడం ద్వారా ఎందుకు విరమిస్తారో తెలుసుకోవాలి.

రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్ లో తొమ్మిదో నెల. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అంగరంగ వైభవంగా, ఆనందంతో నిర్వహించుకుంటారు. రంజాన్ నెలలో ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. దీనిని రోజా అని పిలుస్తారు. సూర్యోదయానికి ముందు సెహరి పేరుతో వభో...