భారతదేశం, మార్చి 2 -- ముస్లీం సోద‌రుల ప‌విత్రమైన రంజాన్ మాసం మొదలైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముస్లీం సోద‌రుల‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం రంజాన్ నెలలో ముస్లీం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒక గంట ముందు తమ కార్యాలయాలు, పాఠ‌శాల‌ల‌ నుండి ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది.

ముస్లీం ఉద్యోగులకు న‌మాజ్ చేసుకువ‌డానికి, అలాగే సాయంత్రం ఉప‌వాసం తీర్చుకోవ‌డానికి అవ‌కాశం క‌ల్పించింది. ఇస్లాం మతాన్ని ఆచ‌రించే ఉద్యోగులంద‌రికీ ఈ అవ‌కాశం ఉంటుంది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించబడిన ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లోని ముస్లీంల‌కు ఈ అవ‌కాశాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం కల్పించింది.

పవిత్రమైన "రంజాన్" మాసంలో అన్ని పని దినా...