Hyderabad, మార్చి 16 -- ఈ ఏడాది ఇండియాలో రంజాన్ ఎప్పుడు జరుపుకోవాలి, మార్చి 2న మొదలైన పవిత్ర మాసం రంజాన్ ఎప్పుడు ముగియబోతుంది? పండుగ తేదీని ఎలా నిర్ణయిస్తారు? ఈ నెల 29 రోజులు ఉంటుందా.. 30 రోజులు ఉంటుందా అనేది ఎలా ఫైనల్ చేస్తారు. ముస్లిం ఉపవాస దినాలు ఎన్ని రోజులు.. అనే ఆలోచన మీ అందరిలోనూ ఉందా? రండి. రంజాన్‌గా పిలుచుకునే ఈద్ ఉల్ ఫితర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

షవ్వాల్ క్యాలెండర్‌లో తొమ్మిదో నెల అయిన రంజాన్‌ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో, కఠినమైన ఉపవాస దీక్షతో జరుపుకుంటారు. ఈ నెల ముగిసిన తర్వాత మరుసటి రోజును ఈద్-ఉల్-ఫితర్‌గా జరుపుకుంటారు. ఈ నెలారంభాన్ని, నెల ముగియడాన్ని చంద్రుని ఆధారంగా నిర్ణయిస్తారు. అమావాస్యతో ముగిసిన ఎనిమిదో నెల తర్వాత వచ్చే నెలవంకతో రంజాన్ మొదలైతే మళ్లీ నెలవంకతో మాసం ముగుస్తుంది. ఆ తర్వాత రోజే పండుగ. చంద్రుని భ...