Hyderabad, ఫిబ్రవరి 27 -- రంజాన్ ముస్లిం సోదరులకు ముఖ్యమైన పండుగ. ఇది ఆధ్యాత్మిక మాసం. రంజాన్ మాసంలో క్రమశిక్షణగా ఉండాల్సిన అవసరం ఉంది. రంజాన్ సమయంలో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత మాత్రమే భోజనం తినాలి. ఆ మధ్య కాలంలో ఉపవాసం ఉండాలి. నీరు కూడా తాగకూడదు. సూర్యోదయానికి ముందు సహూర్ పేరుతో భోజనం చేస్తారు. సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ తింటారు.

సహూర్ రోజులో ముఖ్యమైన భోజనం. ఇది రోజంతా శక్తిని అందించేందుకు ప్రధానమైనది. సమతుల్యమైన ఆహారం తింటే ఆ రోజంతా ఉపవాసం చేయగలరు. సహూర్ లో నెమ్మదిగా జీర్ణమయ్యే, ఫైబర్‌తో కూడిన ఆహారాలను ఎంచుకోవడం వల్ల మీరు ఎక్కువసేపు శక్తివంతంగా ఉండగలరు.

సహూర్ లో కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల హైడ్రేషన్‌ రాకుండా అడ్డుకోవడానికి, శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలోని ప్ర...