Hyderabad, ఫిబ్రవరి 25 -- రంజాన్ పండుగ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు ఎదురు చూస్తున్నారు. ఉపవాసం, ప్రార్థన, ఆధ్యాత్మిక ధ్యానం కోసం అంకితం చేసిన పవిత్రమైన నెల ఇది. శతాబ్దాలుగా ఉన్న ఈ సంప్రదాయం నెలవంక దర్శనంతో ప్రారంభమవుతుంది. ఇది లోతైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.

రంజాన్ లో ఉపవాసం చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆహారం, పానీయాలను తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు. ఇది ఆత్మ నిగ్రహం, దానధర్మాలు చేయడం, సామాజిక అనుబంధాలను పెంచుకోవడం కూడా రంజాన్ లో భాగమే. కుటుంబాలు, స్నేహితులతో కలిసి ప్రతిరోజూ తెల్లవారుజామున సహ్రీ అనే భోజనాన్ని తింటారు. ఆ తరువాత తిరిగి సూర్యాస్తమయం వరకు ఏమీ తినరు. సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ తో ప్రతిరోజూ ఉపవాసాన్ని విరమిస్తారు. ఇఫ్తార్ ను కూడా ఎవరింట్లో వారు కాకుండా సమూహంగా ఎంతో మందితో క...