Hyderabad, ఫిబ్రవరి 28 -- ప్రపంచవ్యాప్త ముస్లింలంతా పవిత్రంగా జరుపుకునే పండుగ రంజాన్. నెల రోజుల పాటు ఖురాన్ పఠనంతో పాటు ఉపవాస దీక్షను తప్పక ఆచరిస్తారు. తెల్లవారు జాము కంటే ముందే అన్నపానీయాలు స్వీకరించి, సూర్యాస్తమయం వరకూ మంచి నీళ్లు సైతం తీసుకోకుండానే ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. రోజు మొత్తంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా, నీటికి సైతం దూరంగా ఉంటారు. యుక్త వయస్సు వచ్చిన ప్రతి ముస్లిం వ్యక్తి ఉపవాసం ఉండాలంట. అయితే ఇందులో మినహాయింపు కూడా ఉంది. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, దూర ప్రయాణాలు చేసే వారు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదట. 2025వ ఏడాది మార్చి 2 నుంచి రంజాన్ మాసం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రంజాన్ మాసంలో పాటించే మరిన్ని ఆచారాల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా..!

ఇస్లాంలోని నాల్గో స్తంభం ఉపవాసం. ముస్లింలు తప్పుకుండా పాటించాల్సిన ఆచారాల్లో ...