భారతదేశం, ఏప్రిల్ 12 -- హనుమాన్ జయంతి రోజు భక్తులందరూ ఆ ఆంజనేయుడి నామ స్మరణలో మునిగిపోయారు. నేడు (ఏప్రిల్ 12) హనుమాన్ మందిరాలన్నీ భక్తుల పారవశ్యంతో నిండిపోయాయి. మహా బలశాలి, భక్తుల దైవం ఆ హనుమంతుడిని తలుచుకుంటూ భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. ఈ సమయంలోనే శ్రీ ఆంజనేయం సినిమాలోని ఈ పాట ఓ సారి గుర్తు చేసుకోవాలి.

2004లో వచ్చిన తెలుగు సినిమా 'శ్రీ ఆంజనేయం'లోని రామ రామ రఘురామ సాంగ్ ఎంతో పాపులర్ అయింది. ఈ సాంగ్ లో నితిన్ యాక్టింగ్ మెప్పించింది. హనుమంతుని లాగే గాలికి పుట్టా.. గాలికి పెరిగా అంటూ సాగే లిరిక్స్ మనసును హత్తుకున్నాయి. కృష్ణ‌వంశీ డైరెక్షన్ లో వచ్చిన ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ లో ఛార్మి, అర్జున్, చంద్ర మోహన్, ఎల్బీ శ్రీరాం తదితరులు కీ రోల్ ప్లే చేశారు.

ఈ రామ రామ సాంగ్ ను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించారు. ఈ శ్రీ ఆంజనేయం సినిమాకు మణిశర...