భారతదేశం, ఏప్రిల్ 12 -- మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుంచి నేడు (ఏప్రిల్ 12) తొలి పాట వచ్చేసింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ పాటను మూవీ టీమ్ తీసుకొచ్చింది. 'రామ రామ' అంటూ శ్రీరాముడిని కీర్తిస్తూ హుషారుగా ఈ పాట ఉంది. ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.

విశ్వంభర చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రామ.. రామ అంటూ ఉన్న ఈ భక్తి పాటకు మంచి ట్యూన్ ఇచ్చారు. ఈ పాటను స్టార్ సింగర్ శంకర్ మహదేవన్‍తో పాటు లిప్సిక భాస్యం ఆలపించారు. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. రాముడి గొప్పతనాన్ని స్తుతిస్తూ విశ్వంభరలోని పాట సాగింది. చిరంజీవి డ్యాన్స్, ఏఐ విజువల్స్ కూడా లిరికల్ వీడియోలో ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూడండి. పాడుకోండి.

జై శ్రీరామ్.. జై ...