Hyderabad, మార్చి 24 -- Ram Miriyala About Aay Movie: రామ్ మిరియాల.. ఆయన పాట వింటుంటే మన స్నేహితుడే పాడుతున్నట్లుంటుంది. మన మట్టి వాసనను గుర్తుకు తెచ్చేలా, మన భావోద్వేగాలను స్పృశించేలా పాట పాడటం ఆయన నైజం. ఓ వైపు సింగర్‌గా, మరో వైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన అచ్చ తెలుగు వినోదాల విందుల ఆయ్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

ఎన్నో సక్సెస్‌ఫుల్ మూవీస్ అందించిన ప్రతిష్టాత్మక సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న నెటివిటీ ఫన్ ఎంటర్‌టైనర్ సినిమా ఆయ్. హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ సినిమాకు అంజి కె. మణిపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వేసవ...