భారతదేశం, ఏప్రిల్ 23 -- Ram Double Ismart: ఇస్మార్ట్ శంక‌ర్ సీక్వెల్ డ‌బుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఆగిపోయిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. రెమ్యున‌రేష‌న్ కోస‌మే రామ్ ఈ సినిమా షూటింగ్‌ను ఆపేసిన‌ట్లు పుకార్లు షికారు చేస్తోన్నాయి.

ఈ మూవీ కోసం పూరి జ‌గ‌న్నాథ్ అండ్ టీమ్ త‌న‌కు ఇస్తాన‌ని చెప్పిన రెమ్యున‌రేష‌న్ పూర్తిగా చెల్లిస్తేగానే డ‌బుల్ ఇస్మార్ట్ షూటింగ్ పూర్తిచేసేది లేద‌ని రామ్ ఖ‌రాఖండిగా చెప్పిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. డ‌బుల్ ఇస్మార్ట్ షూటింగ్ నిలిచిపోయిన‌ వార్త సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే పుకార్ల‌లో నిజం లేద‌ని స‌మాచారం.

డ‌బుల్ ఇస్మార్ట్ మూవీని రెమ్యున‌రేష‌న్ లేకుండా చేస్తున్న‌ట్లు స‌మాచారం. ప్రాఫిట్స్ షేర్ బేసిస్ (సినిమాకు వ‌చ్చిన లాభాల్లో వాటా) విధానంలో చేయ‌డానికి అంగీక‌రించిన‌ట్లు చెబుతోన్నారు. కేవ‌లం...