భారతదేశం, ఫిబ్రవరి 13 -- మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. జనవరి 31న కవలలకు జన్మనిచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు, తాజాగా తమ చిన్నారుల నామకరణ వేడుకను హైదరాబాద్‌లోని తమ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ కుమారుడికి 'శివరామ్' అని, కుమార్తెకు 'అన్వీరా దేవి' అని పేరు పెట్టినట్లు ఈ జంట అధికారికంగా ప్రకటించింది.

పిల్లల పేర్ల ఎంపిక గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ, ఇది కేవలం పేరు పెట్టడం మాత్రమే కాదని, ఒక ఆధ్యాత్మిక నిర్ణయమని పేర్కొన్నారు.

"పిల్లలకు పేర్లు పెట్టడం మా ఇద్దరికీ చాలా వ్యక్తిగతమైన, ఆధ్యాత్మికమైన విషయం. ఈ ప్రయాణంలో మా తల్లిదండ్రుల సూచనలు మాకు ఎంతో కీలకం. మా కుమారుడి పేరు 'శివరామ్'.. ఇది శివుడు, రాముడు అనే ఇద్దరు దేవుళ్ల ఆదర్శాలకు ప్రతిరూపం. అంతేకాకుండా, మా నా...