భారతదేశం, ఏప్రిల్ 5 -- శ్రీ రామ నవమి రోజు మెగా ఫ్యాన్స్ సందడి మరో రేంజ్ లో ఉండబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్ది' గ్లింప్స్ రేపే (ఏప్రిల్ 6) రిలీజ్ కాబోతోంది. ఫస్ట్ షాట్ పేరుతో ఈ మూవీ గ్లింప్స్ ను మేక్సర్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ గ్లింప్స్ ను చూశాక రామ్ చరణ్ చేసిన కామెంట్స్ మరింత హైప్ పెంచేస్తున్నాయి.

'పెద్ది' గ్లింప్స్ అదిరిపోయిందని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియోలో 'పెద్ది' గ్లింప్స్ కోసం ఏఆర్ రెహమాన్ స్టూడియోలో సౌండ్ మిక్సింగ్ చేస్తున్నట్లు కనిపించింది. డైరెక్టర్ బుచ్చిబాబు సాన దగ్గరుండి మరీ పనులన్నీ చూసుకుంటున్నారు. ఈ పాన్ ఇండియా మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే.

''పెద్ది గ్లింప్స్ చ...