Hyderabad, ఫిబ్రవరి 18 -- రామ్ చరణ్ తెలుగు టాప్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆస్తులు విషయంలో కూడా తక్కువేమీ కాదు. రామ్ చరణ్ ఫ్యాషన్ పరంగా కూడా ఒక అడుగు ముందుకే ఉంటారు. ఈ మధ్య ఆయన ధరించిన ఒక వాచ్ ఎంతోమందిని ఆకర్షించింది. అది రోలెక్స్ వాచ్. ఫ్యాషన్ ప్రియులకు ఈ రోలెక్స్ ఓయిస్టర్ పెర్పెచువల్ డే-డేట్ 36 వాచ్ అంటే ఎంతో ఆసక్తి ఉంది. ఎందుకంటే ఇది సాధారణమైన టైమ్ పీస్ కాదు. జిగ్సా పజిల్‌తో డయల్ ఎంతో బాగుంటుంది. అధునాతనమైన కొత్త రూపంతో ఇది ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తుంది.

రామ్ చరణ్ పెట్టుకున్న ఈ వాచ్ వెర్షన్ ఎవెరెస్ గోల్డ్. దీనిలో నీలం, ఎరుపు, నారింజ, ఆకుపచ్చ, పసుపు రంగుల శక్తివంతమైన షేడ్స్ ను కలిగి ఉన్నాయి. డయల్ డిజైను పజిల్‌లాగా అనిపిస్తుంది.

18 క్యారెట్ల అసలైన బంగారంతో దీన్ని తయారు చేశారు. అన్ని చేతివాచీల్లాగా ఇందులో అంకెలు ఉండవు. అంకెల...