Hyderabad, ఫిబ్రవరి 5 -- Ram Charan Guest: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత నటిస్తున్న సినిమా ఆర్సీ16. ఇంకా టైటిల్ పెట్టిన ఈ మూవీని బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ సెట్లోకి బుధవారం (ఫిబ్రవరి 5) ఓ స్పెషల్ గెస్ట్ వచ్చింది. ఆ గెస్ట్ ఎవరో కాదు.. చరణ్ ముద్దుల తనయ క్లిన్ కారా. తన కూతురిని ఎత్తుకొని వచ్చిన చరణ్.. గెస్ట్ అంటూ చేసిన పోస్ట్ వైరల్ అయింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ గా ఏమీ ఉండడు. ఎప్పుడో ఓసారిగానీ అతని ఇన్‌స్టాలో మనకు పోస్టులు కనిపించవు. కానీ బుధవారం (ఫిబ్రవరి 5) సడెన్ గా చరణ్ చేసిన ఓ పోస్ట్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

"సెట్‌లో నా చిన్న అతిథి #RC16" అనే క్యాప్షన్ తో చెర్రీ ఓ పోస్ట్ చేశాడు. అందులో రామ్ చరణ్ తన కూతురు క్లిన్ కారాను ఎత్తుకొని కనిపించాడు. తండ్రీకూతుళ్లు ముద్దుము...