భారతదేశం, మార్చి 27 -- రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మెగా ఫ్యాన్స్‌కు ఆర్‌సీ 16 టీమ్ గుడ్ న్యూస్ వినిపించింది. ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేయ‌డంతో పాటు రామ్‌చ‌ర‌ణ్ ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల‌చేసింది. రామ్‌చ‌ర‌ణ్ మూవీకి పెద్ది అనే టైటిల్‌ను క‌న్ఫామ్ చేశారు. ఫ‌స్ట్‌లుక్‌లో కంప్లీట్ డిఫ‌రెంట్ మేకోవ‌ర్‌లో రామ్‌చ‌ర‌ణ్ క‌నిపిస్తున్నారు.

ముక్కుకు పోగు, పొడ‌వైన గ‌డ్డంతో బీడీ వెలిగిస్తూ మాస్ లుక్‌లో రా అండ్ ర‌స్టిక్‌గా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

మ‌రో పోస్ట‌ర్‌లో చేతిలో క్రికెట్ బ్యాట్ ప‌ట్టుకొని సీరియ‌స్‌ లుక్‌లో గ‌త సినిమాల‌కు భిన్నంగా రామ్ చరణ్ ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అభిమానుల‌కు అంచ‌నాల‌కు పూర్తి భిన్నంగా రామ్‌చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్ ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. పోస్ట‌ర్ బ్యాక్‌డ్రాప్‌...