Hyderabad, ఏప్రిల్ 11 -- Anchor Pradeep Machiraju About Ram Charan And Deepika Pilli: టీవీ యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు, యాంకర్ దీపికా పిల్లి జంటగా నటించిన సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ సినిమాకు నితిన్, భరత్ దర్శకత్వం వహించారు.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్ దీపికా పిల్లి, ఇతర సినిమా టీమ్‌పై యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్ యు. మీ ద్వారా సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మాకు ఎప్పుడూ ఆనందం. చాలా మంచి టీంతో కలిసి పనిచేసే అవకాశం నాకు ...