Hyderabad, మార్చి 20 -- Ram Charan Team Clarity On Unfollow Thaman S: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ రెండోసారి జంటగా నటించిన సినిమా గేమ్ ఛేంజర్. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాకు ఎస్ తమన్ సంగీతం అందించారు.

అయితే, ఎన్నో అంచనాలతో జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. అనేక రకాలుగా ఈ మూవీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేదని టాక్ వచ్చింది. భారీ బడ్జెట్‌ ఉన్నప్పటికీ ఎస్ తమన్ అందించిన సంగీతం నుంచి పాటలు, కథ వరకు ప్రతిదీ మెచ్చుకోతగినట్లుగా లేదనే విమర్శలు వచ్చాయి.

అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాటల ఫెయిల్యూర్‌కు కొరియోగ్రాఫర్, హీరోనే కారణం అన్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. దాంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ తమన్‌పై కోపంగా ఉ...