భారతదేశం, ఫిబ్రవరి 24 -- Rakul Preet Singh: ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించిన మేరే హ‌జ్బెండ్ కీ బీవీ ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అర్జున్ క‌పూర్ హీరోగా న‌టించిన ఈ మూవీలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో పాటు భూమి ప‌డ్నేక‌ర్ మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. రొమాంటిక్‌ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా దిశ‌గా సాగుతోంది.

ఫిబ్ర‌వ‌రి 21న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ తొలిరోజు కోటిన్న‌ర వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో ఫ‌స్ట్ డే లోయెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. కంగ‌నా ర‌నౌత్ ఎమ‌ర్జెన్సీ మూవీ రెండున్న‌ర కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. ఆ మూవీ కంటే త‌క్కువ వ‌సూళ్ల‌తో మేరే హ‌జ్బెండ్ కా బీవీ చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకుంది.

మొత్తంగా మూడు రోజుల్లో కేవ‌లం 4.39 కోట్ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే ఈ మూవీ రాబ‌ట్టిన...